విజయ్ వెంట పడుతున్న హీరోయిన్స్

-

ఏ ముహుర్తాన అర్జున్ రెడ్డి సినిమా చేశాడో కాని విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సరదా రోల్ చేసిన విజయ్ ఆ తర్వాత చేసిన పెళ్లిచూపులు అదిరిపోయే హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డిగా తన నటనా ప్రతిభతో యువత మనసులు గెలిచాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం విజయ్ సినిమా అంటే యూత్ ఆడియెన్స్ క్రేజ్ మాములుగా లేదు. అందుకే గీతా గోవిందం రిలీజ్ కు ముందే స్టార్ హీరో సినిమాలానే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. గీత గోవిందం తర్వాత టాక్సీ వాలా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం తమిళంలో నోటా సినిమా చేస్తుండగా తెలుగులో డియర్ కామ్రేడ్ మూవీ సెట్స్ మీద ఉంది.

ఈ రెండు సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా సెలెక్ట్ అయ్యిందట. ఈమధ్య వరుస సక్సెస్ లతో ఫాంలో ఉన్న రాశి.. విజయ్ సినిమా అనగానే కాస్త ఎక్సైట్ ఫీల్ అయ్యిందట. మనోడు హీరోయిన్స్ ను ముద్దుల్లో ముంచెత్తుతున్నా అతనితో జోడి కట్టేందుకు మాత్రం హీరోయిన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి రాశితో విజయ్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news