అక్కినేని నాగేశ్వరరావు నటనా విశ్వవిద్యాలయం: వెంకయ్యనాయుడు

-

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు ఏఎన్నార్​తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పారు.

‘అక్కినేని నాగేశ్వరరావు విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు, మహా మనిషి. ఆఖరు రోజు వరకు నటించిన ఏకైక వ్యక్తి ఏఎన్నార్‌. సినిమారంగంలో విలువలు ప్రదర్శించిన వ్యక్తి ఏఎన్నార్‌. అనేక విషయాలపై ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకునేవాళ్లం. ఏఎన్నార్‌ చూపిన మార్గంలో నడవడమే…ఆయనకు మనమిచ్చే నివాళి. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద నటనా విశ్వవిద్యాలయం. తెలుగు ప్రజల హృదయాల్లో ఏఎన్నార్‌ జీవించే ఉన్నారు. ఏఎన్నార్‌ జీవితాలను పరిపూర్ణంగా చదివారు.’ అని వెంకయ్యనాయుడు

అక్కినేని పెద్దగా చదువుకోకపోయిన జీవితాలను చదివారని వెంకయ్య అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నారని.. సాంఘిక పాత్రల్లో అక్కినేనికి ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. సినిమా ఒక సందేశాన్ని, విజ్ఞాన్ని అందించాలని.. అక్కినేని ప్రతి సినిమాల్లో సందేశం ఉండేదని చెప్పారు. అక్కినేని స్ఫూర్తితో సినిమాలు తీయాల్సి ఉందని.. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష బాగా లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news