పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చెయ్యాలా..? ఈ కారణం పెట్టండి

-

గుర్తింపు పొందిన సంస్థల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్‌ అకౌంట్‌ కచ్చితంగా ఉంటుంది. వచ్చే జీతం నుంచి కొంత ఆ అకౌంట్‌కు మళ్లిస్తారు. నెలకు 1500 నుంచి 3600 అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ డబ్బును రెండు భాగాలుగా చేస్తారు. ఒకటి కాంట్రిబూషన్‌ అయితే మరొకటి పెన్షన్. ఇందులో మనం మన అవసరాలకు తగ్గట్టుగా కొంత అమౌంట్‌ను తీసుకోవచ్చు. కానీ ఉన్న అమౌంట్‌లో.. మీరు చెప్పిన రీజన్‌ను బట్టి.. 20/ 30/ 40 శాతం ఇస్తుంటారు. కానీ మీకు 50 శాతం డబ్బులు కావాలంటే.. ఇప్పుడే చెప్పే రీజన్‌ పెట్టండి. మీరు అనుకున్న అమౌంట్‌ అంతా వచ్చేస్తుంది.

ఖాతాదారులు వెల్లడించే కారణాన్ని బట్టి విత్‌డ్రా పర్సెంటేజీ మారుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు పెళ్లి కోసం 50 శాతం డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈపీఎఫ్ ఖాతా నుంచి పెళ్లి కోసం 50 శాతం డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే ఏడేళ్ల సర్వీస్ కాలం పూర్తై ఉండాలి. అప్పుడే 50 శాతం డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈపీఎఫ్ మెంబర్, వారి కొడుకు లేదా కూతురు, వారి సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తం నుంచి 50 శాతం డబ్బులు డ్రా చేయొచ్చు.

ఉద్యోగి వాటాలో 50 శాతం డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పెళ్లి, విద్య కోసం మూడు సార్ల కన్నా ఎక్కువ అడ్వాన్స్ తీసుకొని ఉండకూడదు. పెళ్లి మాత్రమే కాకుండా ఈపీఎఫ్ ఖాతా నుంచి వేర్వేరు కారణాలతో డబ్బులు డ్రా చేయొచ్చు.

ఇంటి నిర్మాణం, ఇంటి కొనుగోలు, ఆస్పత్రి ఖర్చులు, విద్యాభ్యాసం ఇలా వేర్వేరు కారణాలతో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. మరి మీరు ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అయితే, పెళ్లి కోసం మీరూ మీ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఈపీఎఫ్ఓ సేవా పోర్టల్‌లో లేదా ఉమాంగ్ యాప్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా ఈపీఎఫ్ఓ సేవా పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ సర్వీసెస్‌లో Claim (Form-31, 19 & 10C) లింక్ పైన క్లిక్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
నియమనిబంధనలు అంగీరకించి Proceed for Online Claim పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత I Want to Apply For పైన క్లిక్ చేయాలి. PF Advance (Form 31) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి క్లెయిమ్ సబ్మిట్ చేయాలి.
క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ డబ్బులు జమ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news