టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద దుమారాన్నే లేపింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ అంటూ ఆమె మొదలు పెట్టిన యుద్ధం కాస్త ఎటో వెళ్లిపోయింది. అయితే కాస్టింగ్ కౌచ్ మీద వచ్చిన వార్తలకు కొందరు నటీమణులు సపోర్ట్ గా నిలబడగా కొందరు మాత్రం అలాంటిది మా కెరియర్ లో అసలేమాత్రం జరుగలేదు అన్నట్టుగా ప్రవర్తించారు. అయితే ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ కూడా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. ముఖ్యంగా కొత్త వారు ఇది ఎక్కువగా ఎదుర్కుంటున్నారు అంటూ అనుపమ చెప్పిందని వార్తలు రాశారు.
అయితే లేటెస్ట్ గా ఆ వార్తలపై స్పందించిన అనుపమ అసలు తన ప్రమేయం లేకుండా తాను అన్నట్టుగా వచ్చిన వార్తల మీద ఫైర్ అయ్యింది. నిరాధారమైన వార్తలను ప్రచురించే ముందు కాస్త ఆలోచించాలంటూ మీడియాకు చురకలేసింది. కాస్టింగ్ కౌచ్ మీద తాను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదని.. తన కెరియర్ లో అలాంటి వాటికి ఛాన్స్ లేదని గట్టిగా చెప్పుకొచ్చింది అనుపమ.
ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమకోసమే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస అవకాశాలైతే అందుకుంటుంది కాని విజయాల శాతంలో మాత్రం వెనుకపడి ఉంది. ఇకనుండైనా అమ్మడు వరుస హిట్లు కొడుతుందేమో చూడాలి.