డబ్బులిచ్చాకే ‘నోటా’ రిలీజ్.. లేదంటే రిలీజ్ ఆపేస్తా

-

విజయ్ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 4 రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమాకు తెలుగు రచయిత శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ పనులు చూసుకున్నారు. సినిమాకు తెలుగు డైలాస్ రాసింది ఆయనే. అయితే నోటా సినిమా తెలుగు ట్రైలర్ లో తనకు స్థానం కల్పించలేదని హర్ట్ అయ్యాడు శశాంక్ వెన్నెలకంటి.

అంతేకాదు తనకు రావాల్సిన డబ్బులు కూడా ఇంకా సెటిల్ చేయలేదట. పేరు వేయకపోగా రెమ్యునరేషన్ కూడా డబ్బులు కూడా ఇవ్వలేదని శశాంక్ వెన్నెలకంటి తన విషయం సెటిల్ చేసేంత వరకు నోటా రిలీజ్ ఆపేస్తానంటూ సన్నిహితులతో చెబుతున్నాడట. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కేయి జ్ఞానవెల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావడం లేని కారణంగా అక్టోబర్ 4 నుండి సినిమాను 18కి వాయిద వేస్తున్నట్టు టాక్. అయితే దాని గురించి చిత్రయూనిట్ ఎలాంటి అఫిషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news