అనుష్క సీక్రెట్ ప్రాజెక్ట్..!

-

స్వీటీ అనుష్క భాగమతి సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క పెళ్లి ప్రయత్నాల్లో ఉందంటూ వార్తలు వస్తుండగా ఆమె సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోనా వెంకట్ నిర్మాణ సారధ్యంలో సీక్రెట్ అనే మూవీ చేస్తున్న అనుష్క మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందని తెలుస్తుంది. క్రియేటివ్ డైరక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి డైరక్షన్ లో అనుష్క మూవీ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారట. కథ ఓకే అవగా సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తుంది. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో మరోసారి అనుష్క తన ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. వరుస విజయలాతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుండి ప్రెస్టిజియస్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

భాగమతి తర్వాత సీక్రెట్ గా సినిమాలు చేస్తున్న అనుష్క ఖాతాలో చేస్తున్న ఈ రెండు సినిమాలు కూడా విజయాన్ని అందించాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి స్వీటీ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news