వామ్మో జీవితం అంటే ఇలా ఉంటుందా..?అనుష్క శర్మ

-

దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ లాక్ డౌన్ వలన కష్టాలు పడే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కనీసం తినడానికి తిండి కూడా దొరకక అవస్థలు పడుతున్నారు చాలా మంది. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి నెలకొంది. వారికి ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా సహాయం చేసినా సరే వాళ్ళు మాత్రం ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు మాత్రం కనపడటం లేదు.

ఈ లాక్ డౌన్ ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. నేడు 9వ రోజు. ఇది ఎప్పుడు ఎత్తేస్తారు…? ఇంకా ఇది కొనసాగుతుందా అనే ఆందోళన చాలా మందిలో నేడు నెలకొంది. ఈ క్రమంలో లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడే వాళ్ళ గురించి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఒక ట్వీట్ చేసింది. కాలాన్ని గౌరవిస్తే అది మరింత వెలుగును పంచుతుందని చెప్పుకొచ్చింది. జీవితంలో నిజంగా ముఖ్యమైనవేంటో మనకు అర్థమయ్యేలా చేసింది లాక్ డౌన్ అని చెప్పింది.

తినడానికి తిండి, తాగడానికి నీరు, తలపైన ఓ కప్పు (ఇల్లు) , కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇవి కాకుండా జీవితంలో ఉన్నవన్నీ బోనస్ అని చెప్పుకొచ్చింది. ఈ ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా ఎంతో మంది బాధలు పడుతున్నారని… అలాంటి వారి కోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నా అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం కోహ్లీ ఆమె లైఫ్ ని ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news