7 Arts Sarayu: హిందూ వాదులకు క్షమాపణలు చెప్పిన బిగ్‌ బాస్‌ బ్యూటీ సరయూ

-

గత నాలుగు రోజుల నుంచి బిగ్‌ బాస్‌ బ్యూటీ సరయు అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా స్వయంగా సరయూ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తాను “గిప్పని ఇస్తా” అనే షర్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండంటూ ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండని…తాను ఓ హిందు కుటుంబంలో పుట్టానని గుర్తు చేశారు.

తాను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని.. తాను హిందువుల మనోభావాల్ని దెబ్బతీసాను అంటూ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఇది నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘గిప్పని ఇస్తా” అనే షర్ట్ ఫిల్మ్ లో అభ్యంతరకర సన్నివేశాన్ని మేము డిలీట్ చేసామన్నారు.

తాము సిరిసిల్ల లోని హిందూ వాహిని వారిని కాంటాక్ట్ చెయ్యడానికి గతంలో ట్రై చేసాము కానీ వారు మాకు కాంటాక్ట్ లోకి రాలేదని.. “గిప్పని ఇస్తా” అనే షర్ట్ ఫిల్మ్ కంటెట్ లో మేము తీసిన ఆ సన్నివేశం ఓ సినిమా రిఫరెన్స్ ఆధారంగా తీశామని చెప్పారు. ఓ హోటల్ ప్రమోషన్ లో భాగంగా షూట్ చేసామమని.. దయచేసి నన్ను క్షమించండంటూ సరయూ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news