తన మాటలతో మాములు కథను మనసుకి నచ్చే సినిమాగా మరల్చగలిగే సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్. ఆయన సినిమాలోని మాటలు సగటు మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలవుతాయంటే అతిశయోక్తి కాదేమో. ఆర్భాటాలు లేకుండా సున్నితమైన భావోద్వేగాలతో సంచలనాలు సృష్టించిన త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అరవింద సమేత్ చూస్తే మాత్రం త్రివిక్రం అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు.
ఎన్.టి.ఆర్ తో సినిమా అనగానే యంగ్ టైగర్ ను ఎలా చూపిస్తాడు అనే ఓ డౌట్ వచ్చింది. కాని ఇదవరకు ఉన్న ఎన్.టి.ఆర్ మాస్ ఇమేజ్ ను వాడుకుంటూ తన మార్క్ స్పెషాలిటీ చాటుకున్నాడు గురూజీ. సినిమా కథ కొత్తదేమి కాదు కాని కొత్తగా నచ్చేలా చేశాడు. ఇదే కథ వేరే దర్శకుడు చేస్తే రివ్యూలు రొటీన్ రొట్ట అని వచ్చేవి. కాని వీరత్వానికి కొత్త అర్ధం చెప్పేలా దర్శకుడిగా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు త్రివిక్రం.
ఇన్నాళ్లు చేసిన సినిమాలు చూసి త్రివిక్రం ఇంతే అన్న వారికి అరవింద సమేతతో సమాధానం ఇచ్చాడు. తనలా మాటలు రాయడం ఎవరి వల్ల కాదు కాని మిగతా దర్శకుల్లా యాక్షన్ కథలను చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. సరైన హీరో.. సరైన కథ.. సరైన హిట్ అందుకున్న త్రివిక్రం సత్తా ఏంటో అరవింద సమేత వీర రాఘవ చూపిస్తుంది. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డులు తన పేరు మీద రాసుకునేంత వరకు వదిలేలా లేడనిపిస్తుంది.