తిత్లీ బాధితుల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది

-

విజ‌య‌వాడ‌లో పార్టీ కార్యాల‌యం ప్రారంభంలో ప‌వ‌న్‌

JanaSena Party New Office Opening Ceremony in Amaravati

విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుపాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన సైనికులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్‌తో కలిసి సాయంత్రం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.

విజయవాడలో జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామమని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్న పవన్‌తో కలిసి పనిచేయాలనే తాను జనసేనలోకి చేరినట్లు వివరించారు. ఈ క్రమంలో దీర్ఘకాల పోరాటాలకు సైతం సిద్దంగా ఉన్నమని తెలిపారు.

జ‌న‌సేన క‌వాతులో ప్ర‌తి సైనికుడు పాల్గొనాలి

ఈనెల 15న జరగనున్న జనసేన కవాతులో ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనోహర్‌తో తనకు పాఠశాల స్థాయి నుంచే పరిచయం ఉందని పవన్‌ తెలిపారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన‌ విలువైన సలహాలు, సూచనలు అందిచేవారని తెలిపారు. సరికొత్త రాజకీయ శకం ఏపీకి కావాల్సిన తరుణంలోనే జనసేన ఆవిర్భవించిందని కేవలం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం కాదని పవన్‌ స్పష్టం చేశారు.

ఐటి దాడుల‌కు ఎందుకు టిడిపి ఉలిక్కిప‌డుతోంది? ప‌వ‌న్

పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటీ దాడులు సచివాలయం, సీఎం ఇంటిపై జరిగుంటే ప్రభుత్వానికి అండగా ఉండేవాళ్లమన్నారు. కానీ వ్యాపారవేత్తలపై రైడ్స్ జరుగుతుంటే టీడీపీకి ఎందుకని నిలదీశారు. నిజంగా ఢిల్లీలో మాదిరిగా కేజ్రీవాల్‌పై జరిగినట్లుగా.. అమరావతిలో కూడా ఐటీ దాడులు జరిగుంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్లమని వెల్లడించారు. అయినా తానెప్పుడూ బీజేపీని వెనకేసుకురాలేదన్నారు. వెనకేసుకురావడానికి బీజేపీ మాకు బంధువేమీ కాదన్నారు. మోదీ ‘నాకు బ్రదరు కాదు.. అమిత్ షా నా బాబాయి’ కాదని చెప్పారు.హోదాపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. హోదాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే జనసేన కూడా వస్తుందన్నారు. అఖిలపక్ష నాయకులంతా మోదీని కలవాలని సూచించారు. రాజకీయ జవాబుదారీ కోసమే ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు నిర్వహిస్తుందన్నారు. ఏపీకి సరికొత్త రాజకీయశకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై అమరావతి కేంద్రంగా జనసేన పార్టీ కార్యకలాపాలు ఉండబోతున్నాయని చెప్పారు.

4 రోజుల్లో తెలంగాణ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్ట‌త ఇస్తా- ప‌వ‌న్‌
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని అడిగారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై 4, 5 రోజుల్లో తేల్చేస్తామన్నారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో పర్యటన ముగించాక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలొచ్చేశాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news