కల్కిలో ప్రభాస్ లుక్ పై బాలీవుడ్‌ నటుడి సంచలన వ్యాఖ్యలు

-

‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉందని బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ సంచలన కామెంట్స్ చేశారు. తాను ‘క‌ల్కి’ మూవీ చూశానని కానీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే, ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందని తెలిపారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని ఆయన లుక్‌ జోకర్‌లా ఉందని అన్నారు.

ప్రస్తుతం అర్షద్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు ఫైర్ అవుతున్నారు.  ‘ఎందుకు కొత్త జానర్‌ మూవీలు, నటులను ప్రోత్సహించరు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్‌ ఫెయిల్‌ అవుతోంది. నెపోటిజం మాఫియా’ అంటూ ఓ నెటిజన్‌ తీవ్రంగా ఫైర్ అయ్యాడు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఘన విజయాన్ని అందుకుని ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.1100 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణె, శోభన, పశుపతి కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news