టాప్ 10 సెక్సీమణులు.. 1,2 లలో దీపికా, ప్రియాంక

-

ఆసియా సెక్సీమణులలో ఈమధ్యనే పెళ్లైన ఇద్దరు బాలీవుడ్ భామలు పోటీ పడి మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్, మల్లికా శెరావత్, కత్రినా కైఫ్ వారంతా అసియా సెక్సీమణులుగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ ఇయర్ టాప్ 50 ఆసియా సెక్సీ మణులలో మొదటి స్థానంలో దీపికా పదుకునే ఉండగా.. సెకండ్ ప్లేస్ లో ప్రియాంకా చోప్రా ఉన్నారు.

ఈ ఇద్దరు ఈమధ్యనే వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నారు. ప్రియాంకా అమెరికా పాప్ సింగర్ జోనాస్ ను పెళ్లాడగా.. దీపికా బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ ను పెళ్లాడింది. పెళ్లైనా వీరి క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పాలి. ఇక లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ లో ఉన్న కైత్రినా కైఫ్ 10వ స్థానానికి పడిపోయింది. సెక్సియెస్ట్ భామల లిస్టులో బుల్లితెర హీరోయిన్స్ కు చోటు దక్కింది. టాప్ 3లో నియా శర్మ ఉండగా.. బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న హీనా ఖాన్ 8వ స్థామ సంపాదించింది. మహిరా ఖాన్-4, శివంగి జోష్-5, అలియా భట్-6, సోనం కపూర్-7, హీనా ఖాన్-8, నితి టేలర్-9, కత్రినా కైఫ్ 10వ స్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news