అవెంజ‌ర్స్ అభిమానులు బాధ‌ప‌కండి.. త్వ‌ర‌లో మరిన్ని సినిమాలు వ‌స్తున్నాయి తెలుసా..?

-

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీతో మార్వెల్ స్టూడియోస్ నుంచి చాలా మంది ఇక సినిమాలు రావ‌ని అనుకున్నారు. కానీ వారంతా దిగులు చెందాల్సిన ప‌నిలేదు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26వ తేదీన విడుద‌లైన అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో వ‌చ్చిన అవెంజ‌ర్స్ ఆఖ‌రి చిత్రం కావ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఉన్న ప‌లు ఎమోష‌న‌ల్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను కంట త‌డి పెట్టిస్తున్నాయి. అయితే నిజానికి మార్వెల్ సినిమాల్లో ఇదే ఆఖరిది కాదు. ఇంకా కొన్ని సినిమాలను మార్వెల్ భ‌విష్య‌త్తులో విడుద‌ల చేయ‌నుంద‌ని తెలిసింది.  అవేమిటో ఇప్పుడు ఒక లుక్కేద్దామా..!

అవెంజ‌ర్స్ సూప‌ర్ హీరోస్‌లో ఒక‌రైన ‘బ్లాక్ విడో’ సినిమా మే 2020లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే ది ఎట‌ర్న‌ల్స్ (న‌వంబ‌ర్ 2020 విడుద‌ల‌), బ్లాక్ పాంథ‌ర్ 2 (ఫిబ్ర‌వ‌రి 2021), డాక్ట‌ర్ స్ట్రేంజ్ 2 (మే 2021), షాంగ్ చి (2021), గార్డియ‌న్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 (మే 2022), స్పైడ‌ర్ మ్యాన్ హోమ్ క‌మింగ్ 3 (జూలై 2022), ది ఫాల్క‌న్ అండ్ వింట‌ర్ సోల్జ‌ర్ (2019-20), లోకి (2020-21), వాండావిజ‌న్ (2020-21) సినిమాలు కూడా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు థోర్ 4, యాంట్ మాన్ 3, కెప్టెన్ మార్వెల్ 2, హాక్ ఐ సినిమాల‌ను కూడా తెర‌కెక్కించ‌నున్నారు. కానీ వీటి విడుద‌ల తేదీను ఇంకా ప్ర‌కటించ‌లేదు.

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీతో మార్వెల్ స్టూడియోస్ నుంచి చాలా మంది ఇక సినిమాలు రావ‌ని అనుకున్నారు. కానీ వారంతా దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అవెంజ‌ర్స్ సినిమాలు ఇక‌పై రాకున్నా.. వాటిలో ఉండే సూప‌ర్ హీరోస్‌కు చెందిన వ్య‌క్తిగ‌త సినిమాల‌ను మాత్రం చూడ‌వ‌చ్చు. అయితే అవెంజ‌ర్స్ సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌కుండా కొత్త సూప‌ర్ హీరోల‌తో మార్వెల్ స్టూడియోస్ ఆ సినిమాల‌ను మ‌ళ్లీ నిర్మించే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక స‌మాచారం ఇంకా వెలువ‌డ‌లేదు. ఏది ఏమైనా.. మార్వెల్ కామిక్స్ ప్రేమికులు దిగులు చెందాల్సిన ప‌నిలేదు. త్వ‌ర‌లోనే మ‌రికొంద‌రు సూప‌ర్ హీరోలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు వ‌స్తున్నారు.. మ‌రి ఆ సినిమాల కోసం సిద్ధం కండి ఇక‌..!

Read more RELATED
Recommended to you

Latest news