తెల్లవాళ్ల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. వెండితెర మీద ఆయన జీవిత చరిత్రను సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. అప్పట్లో మంచి ఫాం లో ఉన్న కృష్ణ అల్లూరిగా కనిపించడం ఓ పెద్ద సాహసం. ఆ సినిమా టైంలో కృష్ణది నిర్ణయానికి అందరు షాక్ అయ్యారు. కాని ఆఫ్టర్ సినిమా రిలీజ్ కృష్ణ నట విశ్వరూపం ఏంటో చూపించారు. రాముడు, కృష్ణుడు అంటే ఎన్.టి.ఆర్ ఎలా గుర్తొస్తాడో అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకొస్తారు.
ఇక ఆ తర్వాత చాలామంది అడపాదడపా అల్లూరిగా కనిపించిన విషయం తెలిసిందే. అసలైతే అల్లూరి సినిమాను సీనియర్ ఎన్.టి.ఆర్ చేయాల్సింది ఆయన చేయాలా వద్దా అనుకుంటున్న టైంలో కృష్ణ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బాలకృష్ణ మరోసారి అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరిస్తున్నారు. దానికి సంబందించిన లుక్ ఈరోజు రిలీజ్ చేశారు.
అల్లూరిగా బాలయ్య సూటయ్యాడు. ఈ లుక్ కోసం చిత్రయూనిట్ చాలా కేర్ తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి అల్లూరి గెటప్ తో బాలకృష్ణ మరోసారి ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి మాట్లాడుకునేలా చేశారు. జనవరి 9న ఎన్.టి.ఆర్ మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అవనుంది.