బయోపిక్ నుండి తేజ ఎందుకు తప్పుకున్నాడంటే..!

-

మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా మొదట తేజ డైరక్షన్ లో ముహుర్తం పెట్టారు. రామకృష్ణ స్టూడియోలో అట్టహాసంగా ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. అయితే సినిమా నుండి అనూహ్యంగా తేజ ఎక్సిట్ అయ్యాడు. తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి ఎందుకు బయటకు వచ్చాడు అన్న దాని మీద ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారే తప్ప అసలు జరిగింది ఇది అని ఎవరు చెప్పలేదు.

ఇక సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో నందమూరి బాలకృష్ణ దానికి వివరణ ఇచ్చారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి తేజ తప్పుకోవడానికి కారణం కేవలం అతనికి ఈ సినిమా తలకు మించిన భారంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ కథ చాలా గొప్పది దాన్ని సరైన విధంగా చెప్పాల్సి ఉంటుంది. తేజ అందుకు తగినట్టుగా కథ సిద్ధం చేసుకున్నా సినిమా కచ్చితంగా అతనికి భారం అవుతుందని తప్పుకున్నాడట. మరి బాలకృష్ణ వర్షన్ ఇలా ఉంది తేజ కూడా ఇదే చెబుతాడాతా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news