మీరు ఎప్పుడైనా కులుమనాలి వెళ్లారా? అక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందో.. అక్కడ ఎప్పుడూ అలాగే ఉంటుంది. చాలా మంత్రి పర్యాటకులు ఎండాకాలం కులుమనాలి వెళ్తారు. అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. సాధారణంగానే చలిగా ఉండే ఆ ప్రాంతం.. ఇప్పుడైతే ఎలా ఉందో తెలుసా? మొత్తం మంచు వర్షంలో మునిగిపోయింది. మంచు దుప్పటిలో ఉంది. సాధారణంగా ఉత్తరాది రాష్ర్టాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా. అందులో జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో చెప్పనక్కర్లేదు. రోజూ మంచు వర్షమే. జనాలు బయటికి రావాలంటేనే దడుసుకుంటారు. అంత చలి ఉంటుంది అక్కడ. మరి.. అక్కడ కురుస్తున్న మంచు వర్షంతో అక్కడి ప్రాంతాలన్నీ కనువిందుగా మారాయి. ఆ మంచు వర్షాన్ని మనం కూడా చూద్దామా?
Fresh snowfall in Manali. @TimesNow pic.twitter.com/xESRMfgoAk
— Saumya Trivedi (@NawabiNerd) January 6, 2019