బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువేనా…?

-

సెంటిమెంట్లు అనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. సినీ పరిశ్రమ లో నటులకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నటనలో సెంటిమెంట్స్ ఏంటి అనుకుంటున్నారా..? అవును సినీ పరిశ్రమ లో కూడా సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కోకరికి ఒక్కోరకంగా ఉంటాయి. ఒకరికి ఒక పాత్ర సెంటిమెంట్ అయితే, ఒకరికి ఒక దర్శకుడు సెంటిమెంట్, ఇలా పలురకాల సెంటిమెంట్లు సినీ పరిశ్రమ లో మనం చూస్తున్నాం.

అయితే నటసింహం బాలకృష్ణ కు కూడా సెంటిమెంట్ ఎక్కువేనట. తనకు కలిసిరాని క్యారెక్టర్స్ జోలికి బాలకృష్ణ మరోసారి వెళ్లిన సందర్బాలు తక్కువ. ఇప్పుడు మళ్లీ ఇటువంటి నిర్ణయాన్నే బాలకృష్ణ తీసుకున్నారని తెలుస్తోంది. తన తండ్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగాతెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఎన్టీఆర్ పాత్ర పోషించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలయ్యారు.

ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా నిలిచాయి. తన తండ్రి పాత్ర తనకు కలిసిరాక పోవడం బాలకృష్ణకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అయితే తాజాగా తమిళంలో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణ ను సంప్రదించగా దీనికి బాలయ్య నో చెప్పారని తెలిసింది.

అంతే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం కూడా బాలయ్య ఈ సినిమాలో నటించకపోవడానికి మరో కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య నో చెప్పడంతో అసలు తలైవిలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందా ? ఒకవేళ ఉంటే ఎవరు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news