ముగ్గురికీ ఒక్కరే..!

-

అవును… మెగా ఫ్యామిలీలోని ఆ ముగ్గురు స్టార్ హీరోలకు నందమూరి బాలకృష్ణ ఒక్కరే పోటీగా నిలుస్తున్నారు. ఎప్పుడు పోటీగా నిలిచారు.. అసలు ఏంటి కథ అంటారా? అదేనండి.. ప్రతి సంవత్సరం సంక్రాంతికి విడుదలయ్యే మెగా హీరోల సినిమాల్లో ఎవరో ఒకరి సినిమాతో నందమూరి బాలకృష్ణ ఒక్కరే ఢీకొంటున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు అంటారా? ఇంకెవరు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా చూసుకుంటే… అటు బాలకృష్ణ ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ వినయ విధేయ రామ.. సినిమా రెండూ సంక్రాంతి కానుకగా రిలీజయ్యాయి.

అలా ఇప్పటి నుంచి కాదు.. దశాబ్దాల నుంచి చిరంజీవి, బాలకృష్ణ అగ్రనటులుగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి మెగా హీరోలతో బాలకృష్ణ ఒక్కరే ఢీకొంటూనే ఉన్నారు. ఇక్కడ ఎవరి సినిమాలు హిట్టయ్యాయి.. ఎవరి సినిమాలు ఫ్లాపయ్యాయి అనే దాని మీద కాదు చర్చ. కాకపోతే.. ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరితో మాత్రం ప్రతి సంక్రాంతికి బాలయ్య ఢీకొంటూనే ఉన్నారు.

2017 లో కూడా అటు చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150, ఇటు బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి రెండూ సంక్రాంతి కానుకగా రిలీజయ్యాయి. ప్రతి సంక్రాంతికి ఎలాగూ బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 2018లోనూ సంక్రాంతికి బాలకృష్ణ జైసింహా సినిమా రిలీజ్ అయింది. అటు మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి కూడా 2018లో సంక్రాంతి కానుకగానే రిలీజయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version