చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`…బాల‌కృష్ణ‌…?

గుణశేఖర్ రూపొందించిన చిత్రం `రుద్రమదేవి`. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో మెరిసిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ చేసిన ఆ పాత్ర‌ `రుద్ర‌మ‌దేవి` సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. గ‌త కొన్నేళ్లుగా గోన గన్నారెడ్డిపై పూర్తి స్థాయి సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసిన గుణ‌శేఖ‌ర్ చివరికి ఆ పాత్ర‌తో సంతృప్తి ప‌డాల్సి వ‌చ్చింది.

తాజాగా మ‌రోసారి గోన గ‌న్నారెడ్డి వార్త‌ల్లో నిలుస్తున్నాడు. త్వ‌ర‌లో గోన గ‌న్నారెడ్డి బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం ఇటీవ‌లే మేక‌ర్స్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన హిస్ట‌రీని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నార‌ట‌. క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు ఈ చిత్రానికి డైరెక్ష‌న్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రంలో బాల‌య్య న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. – ఎన్‌బికె 106 గా రానున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ మూవీని పూర్తి చేసిన త‌రువాత గోన గన్నారెడ్డి బ‌యోపిక్‌కి బాలకృష్ణ రెడీ కానున్నార‌ని చెబుతున్నారు.