రివ్యూ : “రూలర్” బాలకృష్ణ అభిమానులకూ ఒక్కసారే..

-

 రివ్యూ : “రూలర్” –   ట్రడక్షన్

నందమూరి బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహా నాయకుడు’ వంటి రెండు పరాజయాల తర్వాత చేస్తున్న సినిమా ‘రూలర్’. యాక్షన్ ఎంటర్ టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ సంక్రాంతికి ముందే సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. సినిమాలో విభిన్నమైన పాత్రలో బాలకృష్ణ నటించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి సినిమా హాల్ దగ్గర అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలకృష్ణ కెరీర్లో ‘జై సింహా’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ సినిమా తెరకెక్కింది.

సినిమా స్టోరీ:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం పోరాడిన స్టోరీగా డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ‘రూలర్’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య బాబు ఉత్తరప్రదేశ్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్న తరుణంలో రెండువేల రైతు కుటుంబాల కోసం ఓ బడా కంపెనీ సీఈఓగా బాలకృష్ణ ఎలా మారాడు అదేవిధంగా సినిమాలో ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ రైతుల కోసం సినిమా లో ఏం చేశారు అనేది చాలా సస్పెన్స్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ధర్మ అసలు రైతుల కోసం ఎందుకు పోరాడాడు అనేది సినిమా తెరపై చూడాల్సిందే.


అంతేకాకుండా సినిమాలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కూతుర్ని ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ఎందుకు కాపాడాల్సి వచ్చింది వంటి విషయాలు చాలా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్. సినిమా మొత్తం మీద ఫస్టాఫ్ అద్భుతంగా తెరకెక్కించిన సెకండాఫ్… ఫస్టాఫ్ అంతా లేకపోవడంతో…సినిమా చివరాకరికి వచ్చేసరికి సినిమా హాలు నుండి చాలా మంది అభిమానులే బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. మొత్తంమీద చూసుకుంటే ‘రూలర్’ ఫస్టాఫ్ కేక సెకండాఫ్ పూర్తిగా నిరాశ పరిచాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– బాలయ్య ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌
– వేదిక‌, సోనాల్ చౌహాన్ అందాలు
– ఫ‌స్టాఫ్‌లో సీన్లు
– బాల‌య్య డ్యాన్సులు
– ఎడిటింగ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– రొటీన్ క‌థ‌, రొటీన్ క‌థ‌నాలు
– తేలిపోయిన సెకండాఫ్‌
– ఓన్లీ ఫ‌ర్ బాల‌య్య ఫ్యాన్స్‌

ఓవరాల్ టాక్:-

‘రూలర్’ బాలయ్య అభిమానులు ఒకసారి చూడాల్సిన సినిమా. సాధారణ ప్రేక్షకులకు సినిమా నచ్చదు. రొటీన్ తరహాలో డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించడం జరిగింది. ‘రూలర్’ లో సినిమాలో కొత్తదనం పెద్దగా ఏమీ కనబడదు. చాలా బోరింగ్ సబ్జెక్ట్.

Read more RELATED
Recommended to you

Latest news