బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న బాలయ్య.. కారణం..?

-

నందమూరి నటసింహం గా బాలకృష్ణ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నేతగా కూడా హిందూపురం అభివృద్ధికి తన వంతు పాటుపడుతున్నారు. ఒకవైపు సినిమాలు .. మరొకవైపు రాజకీయాలు అంటూ రెండింటిని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాతో సరికొత్త ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. జానపద, సాంఘిక, పౌరాణిక వంటి ఎన్నో చిత్రాలలో కూడా నటించి.. కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను సొంతం చేసుకున్న బాలయ్య తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్నాడు. అంతేకాదు సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.బాలయ్య బాబు రిజెక్ట్ చేసిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే..

చంటి:
వెంకటేష్ హీరోగా, మీనా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సినిమా కథ ముందుగా బాలయ్యకు వినిపిస్తే.. ఆయన నచ్చక రిజెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

జానకి రాముడు:
నాగార్జున నటించిన జానకి రాముడు సినిమా కూడా మొదట బాలయ్య బాబుకు వినిపించారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో.. వెంకటేష్ ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సింహరాశి:
రాజశేఖర్ సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సింహరాశి సినిమా బాలకృష్ణ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ ఈ సినిమాలు చేసి ఆయన కెరీర్ ను మలుపు తిప్పుకున్నారు.

సూర్యవంశం:
ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాని కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేశారు. సూర్యవంశం సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక వీటితో పాటు పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా , జగపతి బాబు నటించిన శివరామరాజు , విక్టరీ వెంకటేష్ నటించిన బాడీగార్డ్ , ఎన్టీఆర్ నటించిన సింహాద్రి , రవితేజ నటించిన క్రాక్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా బాలకృష్ణ కేవలం కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version