నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను – బండ్ల గణేష్

-

బండ్ల గణేష్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కల్యాణ్ కు భక్తుడిగా పేరు గాంచిన విషయం తెలిసిందే. అంతకు ముందు చిన్న వేషాలు వేస్తూ పెద్దగా పేరు లేని బండ్ల గణేష్ ఇక పవన్ కల్యాణ్ తో సినిమా గబ్బర్ సింగ్ తో ఎక్కడికో వెళ్ళి పోయాడు.

దానితో వరసగా సినిమాలు నిర్మించడం చేస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా తిరుమల….శ్రీవారిని దర్శించుకున్నారు బండ్ల గణేష్. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. నేను ఏ పార్టీలో లేను.. వేంకటేశ్వరస్వామి పార్టీయే నా పార్టీ అని తెలిపారు బండ్ల గణేష్. నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకున్నాను… అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని వెల్లడించారు సినీ నిర్మాత బండ్ల గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news