మా బాస్ ఓకే చెప్పేశారు – బండ్ల గ‌ణేష్‌

బండ్ల గ‌ణేష్ త‌న పొలిటిక‌ల్ షో ఫ్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు బండ్ల గ‌ణేష్‌. అయితే అత‌ని పాత్ర‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న రాలేదు. ఆ సినిమాలో అన‌వ‌స‌రంగా చేశాన‌ని బండ్ల ప్ర‌క‌టించారు కూడా.

దీంతో ఇక నిర్మాత‌గా మ‌ళ్లీ ట్రైల్స్ చేయాల్సిందే అని భావించిన బండ్ల ఆ ప్ర‌య‌త్నాల్లో బిజీ అయిపోయాడు. అయినా బండ్ల ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. అయితేనేం బండ్ల ఊరుకోడుగా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. ప‌వ‌న్‌తో మ‌ళ్లీ సినిమా చేయాల‌ని చేస్తున్న అత‌ని ప్ర‌య‌త్నాలు మొత్తానికి ఫ‌లించాయి. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు బండ్ల గ‌ణేష్‌. నా బాస్ మొత్తానికి ఓకే చెప్పారు. మ‌రోసారి నా క‌ల నెర‌వేర‌బోతోంది. థ్యాంక్యూ మై గాడ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్` అని ట్వీట్ చేశాడు. ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించనున్న 30వ చిత్రం కాబోతోంది.