ట్రెండ్ ఇన్: ఆడియన్స్ ఓపికకు టెస్ట్ ‘బీస్ట్’..విజయ్ సినిమా డిజాస్టర్!

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రం బుధవారం విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. అయితే, ఈ చిత్రానికి డిజాస్టర్స్ రేటింగ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే చిత్రం డిజాస్టర్ అని పేర్కొంటూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #BeastDisaster హ్యాష్ ట్యాగ్ బీస్ట్ డిజాస్టర్ ను ట్రెండ్ చేస్తున్నారు.

 

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బీస్ట్’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని ఈ సందర్భంగా మీమ్స్ క్రియేట్ చేసి వాటిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే, బీస్ట్ పిక్చర్ మరో వైపున తమిళనాట బాగానే ఆడుతున్నదని విజయ్ అభిమానులు చెప్తున్నారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు.

‘మాస్టర్’ సినిమా తర్వాత విజయ్ నటించిన పిక్చర్ ‘బీస్ట్’. కాగా, ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిత్రం కూడా బాగుంటుందని అనుకున్నారు. కానీ, అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. రా(ఇంటెలిజెన్స్) ఆఫీసర్‌గా విజయ్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందని, కానీ, ఒకే ప్లేస్ లో సినిమాను ఎంగేజ్ చేయడం సరి కాదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక నెల్సన్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. హ్యూమర్ జనరేట్ చేయడంలో ఈ సినిమాలో నెల్సన్ ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version