ఏపీ ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌‌లో ఈ మార్పులు గమనించారా?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 3,95,428 మంది, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు 2,11,43 మంది, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 16,195 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,780 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి ఈసారి గదికి 16 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. గతంలో పరీక్ష గదిలో 24 మంది కూర్చొని రాసేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండేవి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు ఏడు పేపర్ల మేరకు పదో తరగతి పరీక్షలను రాయనున్నారు. ఈసారి విద్యార్థులు సమాధానాలు రాసేందుకు విడివిడిగా కాకుండా, నంబర్లతో కూడిన 24 పేజీల బుక్‌లెట్లను అందించనున్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ -2022

తేదీ సబ్జెక్ట్ సమయం

27-04-2022 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-ఏ) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I(కంపోజిట్ కోర్సు)

28-04-2022 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

29-04-2022 థర్డ్ లాంగ్వేజ్(ఆంగ్లం) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

2-05-2022 మ్యాథమెటిక్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

4-05-2022 ఫిజికల్ సైన్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

5-05-2022 బయోలాజికల్ సైన్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

6-05-2022 సోషల్ స్టడీస్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45

7-05-2022 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -II ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
(కంప్యూటర్ కోర్సు) అండ్
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్
పేపర్-I (సంస్కృతం, అరబిక్ అండ్ పర్షియన్)

9-05-2022 ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
( పేపర్-II సంస్కృతం, అరబిక్ & పర్షియన్ )

9-05-2022 ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ లాంగ్వేజ్(థియరీ) ఉదయం 9.30- మధ్యాహ్నం 11.30

Read more RELATED
Recommended to you

Exit mobile version