ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతుందని కేటీఆర్ ప్రకటన చేశారు. ప్రజా స్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబెడ్కర్ ఆదర్శమని.. ఎనిమిది నెలల గా అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరము గా సాగుతున్నాయన్నారు. 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడి అవుతుందని… ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పనులు పూర్తి అవుతుందన్నారు.
భారత దేశ ప్రజలు కి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోందని.. తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగిన అంబేద్కర్ బాటలో నడుస్తున్నామని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలు కి స్ఫూర్తి వంతం గా తెలంగాణ నడుస్తుందని.. రాష్ట్ర ప్రయోజనాలు కి ఎవరు విఘాతం , కేంద్రం అడ్డంకులు కల్పించిన పోరాడాతామన్నారు.
అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాదించామని.. మ్యూజియం, ధ్యాన మందిరం నిర్మించాలని సూచనలు వస్తున్నాయన్నారు. రామేశ్వరం లో ఉన్న అబ్దుల్ కలాం, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలు ను సందర్శించి విగ్రహ నిర్మాణము చేపడతామని… ముఖ్యమంత్రి సంకల్పం ఈ విగ్రహమని చెప్పారు. దేశ ప్రజలు కు ఇదొక కానుక అని.. ఆంబేడ్కర్ ఆశయాలు పూర్తి స్థాయి లో అమలు కావాలని కోరారు. ఆర్ధిక అసమానతలు కి తావు లేకుండా దేశ ప్రజలు అందరు బాగుపడాలన్నారు.