వైరల్ ఫోటో: బెల్లంకొండ లుక్స్ అదుర్స్..!

-

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో విభిన్నమైన లుక్స్ తో ఉన్న ఫొటోలను అప్లోడ్ చేస్తూ తెగ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే షేర్ చేసిన అల్ట్రా మోడ్రన్ లుక్ లో గడ్డంతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఈ యువ హీరో తాజాగా రెట్రో లుక్ తో ఉన్న మరో ఫొటోను షేర్ చేశాడు. ఈసారి రెట్రో లుక్ తో మరింత స్టైలిష్ గా కనిపించాడు బెల్లంకొండ హీరో. రెట్రో రాయల్ కారు వద్ద, అంతే హుందాగా కనిపిస్తూ పాత సినిమాల్లో హీరో మాదిరిగా భలే స్టైలిష్ గా నిల్చున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో లుక్ కు అంతా కూడా ఫిదా అయ్యి, పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతం మన బెల్లంకొండ హీరో ‘ అల్లుడు అదుర్స్ ‘ సినిమాలో నటిస్తున్నాడు.

srinivas
srinivas

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాలో అందాల భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే షూటింగ్ పూర్తి అయ్యి సినిమా ప్రేక్షకుల ముందుకు ఈపాటికే వచ్చి ఉండేది. కాని కరోనా కారణం చేత షూటింగ్ ఆగిపోయింది. 6 నెలల తర్వాత మళ్లీ షూటింగ్ ఈమధ్యనే పునఃప్రారంభం అయ్యింది. ఈ ఏడాది చివరికి సినిమా విడుదలకు రెడీ చేయాలని భావిస్తున్నారు. మాస్ మసాలా సినిమాగా అల్లుడు అదుర్స్ మూవీ ఉంటుందని మూవీ మేకర్స్ పక్కాగా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news