బాలయ్య ఫ్యాన్స్​కు దిమ్మదిరిగే న్యూస్.. ‘భగవంత్‌ కేసరి’ వచ్చేది ఆరోజే!

-

సలార్ సినిమా వాయిదాతో మిగతా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో వాటికి చిత్రబృందం చెక్‌ పెట్టింది.

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల చేయనున్నట్లు గతంలో మూవీ యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సలార్ మూవీ రిలీజ్ వాయిదా, తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా విడుదల వాయిదా పడనుందన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై క్లారిటీ ఇస్తూ మూవీ యూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. అందులో రిలీజ్‌ డేట్‌ అక్టోబర్‌ 19 ఉండడంతో అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు.

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news