జీ-20తో భారతదేశం సత్తా ఏంటో చూపించాం – ప్రధాని మోడీ

-

జీ-20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకున్నాం.. భారతదేశం సత్తా ఏంటో చూపించామని ప్రధాని మోడీ వెల్లడించారు. పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… భారత పురోగతిని ప్రపంచమంతా కొనియాడుతోందని చెప్పారు. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని వివరించారు. పార్లమెంట్ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సాహం వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన సమయమిది.. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నామన్నారు. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైనదని వెల్లడించారు. భారతీయుల స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించామన్నారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు. ఈ పార్లమెంట్ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుందన్నారు. మనం కొత్త భవనంలోకి వెళుతున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తి నిస్తుందని కొనియాడారు ప్రధాని మోడీ. ఈ వినాయక చవితి రోజును జరగబోయే ఈ సమావేశాల్లో తీసుకోబోయే నిర్ణయాలతో.. మున్ముందు భారత అభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news