Bheemla Nayak : “భీమ్లా నాయక్‌” మూవీ హిందీ ట్రైలర్‌ రిలీజ్‌..దుమ్ములేపిన పవన్‌

-

టాలీవుడ్ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నటించిన బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ”భీమ్లా నాయక్‌”. పవన్‌ కళ్యాణ్‌ స్థాయిని మరోసారి నిరూపిస్తూ.. భారీగా కలెక్షన్ల ను కొల్లగొడుతోంది భీమ్లా నాయక్‌ సినిమా. మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషి యుమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు పండగా తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమా వంద కోట్ల వసూళ్ల వైపునకు దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భీమ్లా నాయక్‌ సినిమా హిందీ ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. మొదటి సారిగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారు. ఇక హిందీ ట్రైలర్‌ లో నూ పవన్‌ కళ్యాణ్‌, రానా ల మధ్య సీన్స్‌ హైలేట్‌ గా నిలిచాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news