టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్.. మలయాళీ భామ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిల టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. మలయాళం లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా.. అనతరం టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
2016 లో వచ్చిన మలయాళీ చిత్రం పాప్ కార్న్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. ఈమె తెలుగులో ఒప్పుకున్న మొదటి సినిమా బింబిసార కాగా భీమ్లా నాయక్ మొదటగా విడుదలయింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. ఇందులో హీరో రానాకు జోడిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బంబిసారా సినిమాలో కనిపించి అలరించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకోవడమే కాకుండా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. తాజాగా తమిళ హీరో ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన సార్ మూవీ తో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది.. ప్రస్తుతం సమాజంలో ఉన్న విద్యా వ్యవస్థ కారణంగా సామాన్యులు ఎలా చదువులకు దూరం అవుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించి మెప్పించింది సంయుక్త.
సంయుక్త మీనన్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఈమె లక్కీగల్ గా స్థిరపడిపోయింది ఈమె నటిస్తే చాలా సినిమా హిట్ అవుతుందనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఫార్ములాను ఈ భామ కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న తన రెమ్యూనరేషన్ అకస్మాత్తుగా పెంచేసి 70 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది..
అలాగే ఈ భామ వరుస సినిమాల్లో చేయడం కంటే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. క్యారెక్టర్ నచ్చితే సెకండ్ హీరోయిన్ గా కూడా నటించడానికి సిద్ధమేనని.. గ్లామర్ పాత్రలు కూడా చేస్తానంటూ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది..