రూమ‌ర్‌ల‌కు భూమిక స్ట్రాంగ్ రిప్లై!

-

 

హీరోయిన్ భూమిక త‌న భ‌ర్త‌, యోగా గురు భ‌ర‌త్ టాకూర్‌తో విడిపోయింద‌ని గ‌త కొంత కాలంగా సెప‌రేట్‌గా వుంటోంద‌ని జోరుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై భూమికి స్పందించ‌డం లేదు. సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `ఎంసీఏ` చిత్రంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.

యుట‌ర్న్‌, స‌వ్య‌సాచి, రూల‌ర్ చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా సంప‌త్‌నంది రూపొందిస్తున్న `సీటీమార్‌` చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే త‌న వివాహ బంధంపై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌పై భూమిక సైలెంట్‌గానే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2007లో ఇదే రోజు యోగా గురు భ‌ర‌త్ టాకూర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా వున్నాడు. త‌ను భ‌ర‌త్ టాకూర్‌తో విడిపోలేద‌ని, ఇద్ద‌రం వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్తాదిస్తున్నామ‌ని క్లారిటీ ఇచ్చేసింది.

మ్యారేజ్ యానివర్స‌రీ సంద‌ర్భంగా భ‌ర్త భ‌ర‌త్ టాకూర్‌తో వున్న ఓ ఫొటోని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని పెట్టింది. `వెయ్యి మైళ్ళ ప్రయాణ‌మైనా ఒకే అడుగుతో మొదలవుతుంది …. ప్రేమ ……. అది ప్రేమే, ప్రేమ‌ని నేర్చుకోవ‌డం.. అవగాహన..ఇదొక ఆనంద‌క‌ర‌‌మైన ప్ర‌యాణం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం అంటే మనమే .. . దేవుడు మమ్మల్ని మా ప్రయాణాన్ని ఆశీర్వదించాలి.. జీవితంలో మీరు చేసే పనుల పట్ల మీ అంకితభావం చూసి గ‌ర్విస్తున్నాను. మ్యారేజ్ యానివ‌ర్సీరీ శుభాకాంక్షలు` అని షేర్ చేసి రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news