అఫీషియల్: నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ సీజన్6..ప్రోమో ఔట్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, సీజన్ 6కు హోస్ట్ గా సమంత వ్యవహరించబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు సీజన్ 6 గ్రాండ్ ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కనిపించారు. దాంతో ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నారని స్పష్టమైంది. సామాన్యులు కూడా ఈ సారి ఈ షోలో పార్టిసిపేట చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చింది. త్వరలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభం కాబోతున్నదని ప్రోమోలో తెలిపారు.

ద వెయిట్ ఈజ్ ఓవర్..బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అని ప్రోమోలో పేర్కొన్నారు. ఈ సీజన్ 6 బిగ్ బాస్…స్టార్ మాలో ప్రసారం కానుందని స్పష్టమవుతోంది. ఓటీటీ బిగ్ బాస్ షోలో బిందు మాధవి విజేతగా నిలిచిన సంగతి అందరికీ విదితమే. త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 పార్టిసిపెంట్స్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news