బిగ్‏బాస్ 5 షురూ.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

ఎంతో మంది ఆతృతగా చూస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా ఈ షో కు అభిమానులు ఉన్నారు. హిందీ, తెలుగు, తమిళ్‌, మలయాలం భాషల్లో బుల్లితెరపై బిగ్‌ బాస్‌ షోకు ప్రత్యేకమై గుర్తింపు ఉంది. ఇక తెలుగు లో రేపు బిగ్‌బాస్ – 5 ప్రారంభం కాబోతుంది. గత కొంత కాలంగా సోషల్‌ మీడియా లో బిగ్‌ బాస్‌ సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌ పేర్లు లీకవుతూ వచ్చాయి.

అయితే.. కొత్త కొత్త పేర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రేపు బిగ్‌ బాస్‌ స్టార్ట్‌ కాబోతుండటంతో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. లెటేస్ట్‌ సమాచారం ప్రకారం.. ఈ షో రేపు ప్రారంభం కాబోతుండటంతో ఈ రోజే కంటెస్టెంట్లను హౌస్‌ లోకి పంపుతున్నారు నిర్వహకులు. గత కొన్ని రోజులు గా తాజ్‌ డెక్కన్‌, మారియట్‌ హోటల్‌ లో క్వారంటైన్‌ లో ఉన్న పార్టీ సిసెంట్లను ప్రస్తుతం హౌస్‌ లోకి ప్రవేశ పెడుతున్నారు. ఈ సాయంత్రానికి కంటెస్టెంట్స్‌.. బిగ్‌ బాస్‌ హౌస్‌ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం బిగ్‌ బాస్‌ ప్రసారం కానుంది. ఇక ఫైనల్‌ కంటెస్టెంట్స్‌ ఎవరనేదానిపై కూడా స్పష్టత వచ్చేసింది.

బిగ్‌ బాస్‌ హైస్‌ లోకి వెళుతున్న కంటెస్టెంట్స్‌…

  1. యాంకర్‌ రవి

2.యూట్యూబర్‌ సరయూ

3.యానీ మాస్టార్‌

4.సీరియల్‌ హీరో మానస్‌

5.ఆర్జే కాజల్‌

6.యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌

7.సీరియల్‌ నటి ప్రియ

8.నటరాజ్‌ మాస్టార్‌

9.నటి శ్వేత వర్మ

10.లహరి