బిగ్ బ్రేకింగ్ : కేజీఎఫ్ – 3 లో డానియల్ శేఖర్ (రానా)..!!

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కే జి ఎఫ్ చాప్టర్ 1, కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే కేజిఎఫ్ 2 ఎండింగ్ లో కే జి ఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతోంది అని హింట్ కూడా ఇచ్చారు. దీంతో అభిమానులలో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించడం.. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలో ని రూ.1000 కోట్ల క్లబ్లో చేరి పోయి సినీ ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాహుబలి 2 ,RRR సినిమాల లాగే రూ.1000 కోట్ల మార్కును దాటిన ఇండియన్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో హీరోగా యశ్ తన నటనతో పూర్తిగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.KGF 3 Announcement : Yash Fans Spot KGF 3 Hint in KGF 2, Say Picture Abhi Baaki Hai - Twitter Review

ఇకపోతే కే జి ఎఫ్ 3 సినిమాలో ఎవరు నటిస్తున్నారు.. కథ ఏంటి..? తారాగణం ఏంటి.. కంక్లూజన్ ఏంటి..? ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కథనాలు అల్లేసుకుంటున్నారు. ఇక కే జి ఎఫ్ సినిమాల సీరీస్ లో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించి చూసిన ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు.. భయంకరమైన వేషధారణ , విలనిజంతో చక్కగా ప్రేక్షకులను మెప్పించాడు సంజయ్ దత్ . కే జి ఎఫ్ ఎన్ కే జి ఎఫ్ టు రెండు పార్ట్ ల్లో కూడా మొత్తం విలన్ల చనిపోయారు. క్లైమాక్స్ లో హీరో కూడా చనిపోయినట్లు మనకు చూపించారు.Rana Daggubati praises Yash starrer KGF

ఇక కేజిఎఫ్ చాప్టర్ 3 లో హీరో ఎలా బ్రతికాడు అనే విషయాన్ని మనకు చూపించబోతున్నారు. అదేవిధంగా కొత్త కోణం లో విలన్ ఎవరు అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. విలన్ రానా దగ్గుబాటి అనుకుంటున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ట్విట్టర్ లో రానా కి ఇచ్చిన రిప్లైనే కారణం.. అంతేకాదు కే జి ఎఫ్ టు సినిమా ని పొగుడుతూ రానా ట్వీట్ చేస్తే ప్రశాంత్ కూడా రిప్లై ఇచ్చారు. అంతేకాదు త్వరలో కలుద్దాం అంటూ రాసారు ప్రశాంత్. ఇక అందుకే ఈ విషయాన్ని బట్టి ఖచ్చితంగా రానా చాప్టర్ త్రీ లో విలన్ గా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.