‘అల వైకుంఠపురములో’ ట్రైలర్ కి ఇదే అతి పెద్ద మైనస్..!!

-

‘అల వైకుంఠపురములో’ మ్యూసిక్ కన్సర్ట్ ఫంక్షన్ హైదరాబద్ నగరం యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అల్లు అర్జున్ అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే తో పాటుగా సీనియర్ హీరోయిన్ టబు అలాగే ప్రత్యేకమైన కీలకమైన పాత్రలో నటించిన అక్కినేని సుశాంత్ హాజరయ్యారు.

ముఖ్యంగా సినిమా పాటలు డిజిటల్‌ మీడియాలో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేశాయో అదేవిధంగా గ్రౌండ్లో పాటలకు అదే స్థాయిలో అభిమానుల మధ్య నుండి రెస్పాన్స్ వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో సినిమా నిర్మాతలు అల్లు అరవింద్ మరియు రాధాకృష్ణ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. దీంతో థియేట్రికల్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎప్పటిలాగానే డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా హీరోని  బంధువుల ఇంటికి తీసుకెళ్లి సినిమా స్టోరీని నడిపినట్లు తెలుస్తోంది.

సదరు బంధువుల ఇంటి సమస్యల కోసం హీరో పోరాడుతున్నట్లు స్పష్టంగా ట్రైలర్ లో కనబడుతుంది..ఇదే స్థాయిలో ఆ ఇంటి అమ్మాయిని హీరో ప్రేమలోకి దించడం.త్రివిక్రమ్ ‘అతడు’ మరియు ‘అత్తారింటికి దారేది’..’అజ్ఞాతవాసి’, ‘జులాయి’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’ సినిమాలకు అదే ఫార్ములా వాడి గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను తన మార్కు మాటలచేత కట్టిపడేస్తున్నాడు.ట్రైలర్‌ చూస్తే ఇప్పుడు ఇదే ఫార్ములా ‘అల వైకుంఠపురములో’ వాడినట్లు అర్థమవుతోంది. సినిమాలో కొత్తదనం లేకపోతే ఇంకెందుకు? ఊరికినే కాపీ క్యాట్ అని అనరు కదా.. అంటూ త్రివిక్రమ్ డైరెక్షన్ పై మరి అదే విధంగా ‘అల వైకుంఠపురములో’ థియేట్రికల్ ట్రైలర్ పై పెదవి విరుస్తున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. అయితే ట్రయిలర్‌ చూసి సినిమాను నిర్ణయించడం కరెక్ట్‌ కాదు. త్రివిక్రమ్‌ మార్క్‌ ట్రీట్‌మెంట్‌ను తక్కువగా అంచనా వేయలేం. తినబోతూ రుచి అడగటం ఎందుకు?

Read more RELATED
Recommended to you

Latest news