అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి కోసం సేవలందిస్తున్న సంఘాలలో వంగూరి ఫౌండేషన్ ప్రత్యేకమైనది. 1994 లో స్థాపించిన ఈ సంస్థ, తెలుగు సంస్కృతిని, తెలుగు సాహిత్యాన్ని, పరిరక్షించటం లో ఎంతగానో తోడ్పడుతోంది. ఈ సంస్థకి గత 25 ఏళ్ళుగా ప్రతీ సంవత్సరం ఉగాదికి ఉత్తమ రచన పోటీలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా ఈ పోటీలకు ఉత్తర అమెరికా మరియూ ఇతర దేశాలలోని తెలుగు రచయితలకి ఆహ్వానం పలికింది.
ఈ పోటీలలో భారత దేశం మినహా ప్రపంచ అన్ని దేశాలలోని తెలుగు రచయితలు పాల్గొనవచ్చని వంగురి సంస్థ, ఈ పోటీలకై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రచన పోటీలు రెండు విభాగాలుగా ఉంటాయి. మొదటిది, భారత దేశం కాకుండా వివిధ దేశాల వారి నూతన ఆముద్రిత రచనలపై ఉంటుంది. వీటిలో కధనికకి రెండు సమాన బహుమతులు, ఒక్కో బహుమతికి 116 డాలర్లు ఇస్తారు, ఇందులోనే ఉత్తమ కవితకి కూడా రెండు బహుమతులు ఉంటాయి, వీటికి కూడా ఒక్కో బహుమతికి 116 డాలర్లు ఇస్తారు.
రెండవ విభాగములో, మొట్ట మొదటి రచనపై పోటీ ఉంటుంది. ఎంతో మంది కథలు, కవితలు రాయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. కాని వారి రచనలు ఎప్పుడు ఎక్కడ ప్రచురించకపోతే అలంటి వారిని ప్రోత్సహించటానికి ఈవిభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కూడా మొట్టమొదటి కథ, కవిత రెండు ఉంటాయి. ఒక్కో బహుమతికి 116 డాలర్లు ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనే ఆసక్తి కల వారు ఈ సంస్థ వారిచే విడుదల చేయబడిన ప్రకటనలోని నిబంధనలకి అనుగుణంగా పాల్గొనవచ్చు. వారి వారి కథలు, కవితలు వంగురి సంస్థకు అందవాలిన చివరి తేదీ : మార్చ్-05-2020. [email protected] , or [email protected] కి మీ కధలు, కవితలు పంపవచ్చు.