చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ – సైరా కంటే పెద్ద సినిమా ?

-

మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తర్వాత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ఇలా లీడింగ్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సైరా తర్వాత మరో సోషియో ఫ్యాంటసీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట చిరంజీవి. సైరాని మించేలా ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఉంటుందని తెలుస్తుంది. సైరా ను మించే సినిమా అంటే చిరంజీవి ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద న్యూస్ ఇంకోటి ఉండదు. అయితే ఈ సినిమా డైరక్టర్ ఎవరు..? ప్రొడక్షన్ ఏంటన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news