ప్రభాస్ ” కల్కి 2898 AD” నుంచీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

-

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ప్రాజెక్టు కే.. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఈ సినిమాపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియులలో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా అభిమానులే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే రీసెంట్ గా జూలై 20వ తేదీన అమెరికాలో ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో మూవీ టైటిల్ అలాగే ఫస్ట్ గ్లింప్ రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా రెస్పాన్స్ లభించింది.

ఇక ఇందులో అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశాపటాని తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ఉండగా.. ఇప్పుడు మరొక స్టార్ ఇందులో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు తెలుగులో సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా దుల్కర్ తాజాగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోత.. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న దుల్కర్ కి ప్రాజెక్టుకే గురించి ప్రస్తావన వచ్చింది. దాంతో మీడియా వారు మీరు ప్రాజెక్టుకే లో నటిస్తున్నారా? అని అడగ్గా.. దీనికి ఆయన డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా.. ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు..చిత్ర బృందమే చెప్పాలి.. కానీ కల్కి సినిమా అద్భుతంగా ఉండబోతోంది. నాగ్ అశ్విన్ తప్ప మరెవరికి ఇలాంటి ఆలోచన రాలేదు అని కూడా ఆయన తెలిపారు. ఇక కల్కి సినిమా కథ గురించి ఇంతగా చెప్పాడు అంటే కచ్చితంగా ఈయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ కామెంట్ లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మే 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news