భారత్ విశ్వగురు స్థానం పొందే దిశగా పయనిస్తోంది – బాలకృష్ణ

-

77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగరవేశారు ఆసుపత్రి చైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే, నటులు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మనం పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో త్యాగఫలం అన్నారు. వారి పోరాటాల నుండి మనం స్ఫూర్తి పొంది.. చేస్తున్న వృత్తిలో నిజాయితీగా ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

76 ఏళ్లుగా భారత్ విశ్వగురు స్థానం పొందే దిశగా పయనిస్తుందన్నారు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో తిండి గింజలు లేని మన దేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేస్తుందని తెలిపారు. సగటు ఆయుర్దాయం 70 ఏళ్ళు పైగా చేరడానికి ఎంతో మంది వైద్యులు కృషి చేశారన్నారు. సొంతంగా వ్యాక్సిన్ లు తయారు చేస్తున్నాం, స్పేస్ రీసెర్చ్ లో ఎంతో వృద్ధి సాధించామన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news