సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్. అలాగే సింగరేణి కార్మికులకు దసరా మరియు దీపావళి బోనస్గా 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.
దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడంతోపాటు, ఈ పథకం వర్తించే ఆలయాల సంఖ్యను కూడా పెంచిందని వెల్లడించారు సీఎం కేసీఆర్.
ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకుభారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారులకోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టింది. గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించిందని స్ఫష్టం చేశారు సీఎం కేసీఆర్.