పుష్ప 2 నుంచి బిగ్ అప్డేట్.. రంగంలోకి జగపతిబాబు..!

-

2021 లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. సమంత స్పెషల్ సాంగ్ లో అలరించిన చిత్రం పుష్ప.. ఇందులో సునీల్, అజయ్, అనసూయ తదితరులు నెగిటివ్ రోల్ పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా భారీ సక్సెస్ పొందడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని పుష్ప 2 ఒక షెడ్యూల్ పూర్తికాగా మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

తాజాగా మరో నటుడిని కూడా దింపబోతున్నట్లు సమాచారం . అతను ఎవరో కాదు సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన జగపతిబాబును.. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా తీసుకోబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో జగపతిబాబుకి ఒక మంచి పాత్ర రాశాడట సుకుమార్. మొదటి భాగంలో ఎలాగో ఛాన్స్ ఇవ్వలేదు.. కానీ రెండవ భాగంలో ఫాహాధ్ తోపాటు మరో బలమైన విలన్ ఉండాలని సునీల్ కి జతగా జగపతిబాబును కూడా దించుతున్నారట.

మొత్తానికైతే జగపతిబాబు మరొకసారి సుకుమార్ సినిమాలో మంచి పాత్రలో కనిపించనున్నారు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు పుష్ప 2 సినిమా మీరు ఊహించిన దానికంటే మించి ఉంటుందని కూడా చిత్ర యూనిట్ చెబుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జగపతిబాబు రాబోతున్నాడు అని తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫీట్ అందుకుంటుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news