బిగ్ బాస్-3.. అయ్యో అయ్యో అయ్యయ్యో..!

-

బాలీవుడ్ లో 12 సీజన్ల నుండి సూపర్ హిట్ అవుతూ వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ అక్కడ హోస్ట్ సల్మాన్ కు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేలా చేసింది. ఇక అక్కడ మొదలైన బిగ్ బాస్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలకు విస్తరించింది. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఆ రియాలిటీ షోనే కొత్త అనుకుంటే బుల్లితెర మీద ఎన్.టి.ఆర్ హోస్ట్ గా కూడా కొత్త ప్రయత్నమే కాని సూపర్ సక్సెస్ చేశాడు.

ఇక మొదటి సీజన్ సూపర్ హిట్ అయినా సెకండ్ సీజన్ కు హోస్ట్ మారాడు. ఎన్.టి.ఆర్ బిజీగా ఉండటం వల్ల నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా చేశాడు. సెకండ్ సీజన్ కూడా కౌశల్ ఫాలోయింగ్ వల్ల హిట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3కి ఎక్కువ లేట్ చేయకుండా మొదలు పెట్టాలని చూస్తున్నారట. అసలైతే మళ్లీ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ 3 టేకప్ చేస్తున్నాడని అన్నారు.

కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం బుల్లితెర మీద హోస్ట్ గా విక్టరీ వెంకటేష్ కనిపించాలని చూస్తున్నాడట. తన మార్క్ నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న వెంకీ నాగార్జున, చిరుల బాటలో హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. మరి హోస్ట్ గా వెంకటేష్ బిగ్ బాస్ 3 చేస్తాడన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news