కొత్త సంవత్సరం రోజు సరదాగా గడుపుదామని పార్క్ కు వెళ్లిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. పార్క్ నుంచి చిరుతపులి తప్పించుకున్నదని పార్క్ ను మూసేశారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో చోటు చేసుకున్నది. సిలిగురిలో ఉన్న సఫారీ పార్క్ నుంచి ఓ చిరుత పులి తప్పించుకొని పారిపోయింది. దీంతో సెక్యూరిటీ కారణాల వల్ల పార్క్ ను సిబ్బంది మూసేశారు. దీంతో పార్క్ కు వచ్చిన వాళ్లంతా పార్క్ మూసి ఉండటంతో వెనుదిరిగారు.
తప్పించుకున్న చిరుత కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సఫారి పార్క్ లోని ఎన్ క్లోజర్ దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. సఫారి ఎన్ క్లోజర్ లో రెండు మగ, రెండు ఆడ చిరుతలు ఉన్నాయి.