బిగ్‌బాస్ 3: ఈ వీక్ ఎలిమినేష‌న్లో ఊహించ‌ని షాక్‌

-

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ ఇప్ప‌టికే 11 వారాలు కంప్లీట్ చేసుకుని విజ‌య‌వంతంగా 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. వీక్‌లో హౌస్‌లో ఉన్న 8 మంది కంటెస్టెంట్ల నుంచి మ‌రో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేఏ స‌మ‌యం దగ్గరపడింది. ఈ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం. హీరో వరుణ్, సింగర్ రాహుల్, యాక్టర్ మహేష్ విట్టా ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.

వాస్త‌వంగా చూస్తే ఈ ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావ‌డం విశేషం. మ‌రి వీరిలో ఎవ‌రు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తారు ? అన్న‌ది స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఆస‌క్తి రేప‌నుంది. బ‌య‌ట పెడుతోన్న ప్రైవేట్ పోల్స్‌తో పాటు సోష‌ల్ మీడియాలో న‌డుస్తోన్న ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యే అవకాశం వుంది.

రాహుల్, వరుణ్ సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అంచ‌నా వేస్తున్నారు. వ‌రుణ్‌కు హీరో ఇమేజ్ ఉంది. ఇక సింగ‌ర్‌గా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇటీవ‌ల చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారారు. ఈ అంచ‌నాలు ఇలా ఉంటే.. ఇక్క‌డ లెక్క త‌ప్పే అవ‌కాశం కూడా ఉంద‌ని మ‌రికొంద‌రు చెపుతున్నారు.

మ‌హేష్ ఇటీవ‌ల త‌న బిహేవియ‌ర్‌తో న్యూట్ర‌ల్ ప్రేక్ష‌కుల్లో బాగా సింప‌తీ తెచ్చుకున్నాడు. అలాగే మ‌హేష్‌కు ఇటు సినీ అభిమానులు కాస్తో కూస్తో ఉన్నా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో మ‌హేష్‌ను ప్రాంతీయంగా ఓ వ‌ర్గం బ‌లంగా స‌పోర్ట్ చేస్తూ ఓట్లు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌నం జ‌రిగి మ‌హేష్ సేవ్ అయితే రాహుల్‌, వ‌రుణ్‌ల‌లో ఒక‌రు ఎలిమినేట్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news