పుల్లటి పెరుగుతో చుండ్రు మాయం!

-

వర్షాకాలంలో చర్మంతోపాటు తలపైనున్న స్కాల్ప్‌ కూడా పొడిబారుతుంది. ఆ సమయంలో దురద ఎక్కువగా ఉంటుంది. దీంతో దురదకు తట్టుకోలేక గీరడం మొదలుపెడుతారు. స్కాల్ప్‌ నుంచి తెల్లటిపొట్టు రూపంలో చుండ్రు బయటకు వస్తుంది. తెల్లతెల్లగా చుండ్రు కనిపించడం వల్ల తల అంతందంగా కనిపించదు. చుండ్రును సమపాలల్లో నివారించుకోవడానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి. దీంతో వేగవంతంగా చుండ్రును నివారించవచ్చు. అదెలాగో చూద్దాం.

చాలామందిని చుండ్రు సమప్య వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో వారు చిన్నతనంగా భావిస్తుంటారు. చిన్నపాటి చిట్కాలతో సమస్య నుంచి గట్టెక్కొచ్చు.
– వెనిగర్‌, నీటిని సమపాళ్ళలో తీసుకొని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు.
– పెరుగు పలిసిందని సింకులో పడేయకుండా తలకు ఉపయోగించుకోవచ్చు. పుల్లటి పెరుగును తలకు ఐప్లె చేయాలి. 2 గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు నుంచి మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు జట్టు కూడా మెరుస్తుంది.
– రెండు స్పూన్ల మెంతులు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు వాటిని పిండిగా చేసి తలకు పట్టించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలకు తగిన పోషణ అందుతుంది.
– నానబెట్టిన నీటిని పారబోయకుండా స్నానం తర్వాత జుట్టుని ఈ నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
– ఆలివ్‌ ఆయిల్‌ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలిగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి జుట్టుకి పట్టించి మసాజ్‌ చేయాలి. తర్వాత జుట్టుని టవల్‌తో చుట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news