బిగ్‌బాస్ 3 ప్రోమో అదిరింది.. నాగార్జున బాగా చేశారంటున్న ఫ్యాన్స్‌..!

-

తొలి సీజ‌న్‌కు ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, త‌రువాతి సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత అయ్యారు. ఆ త‌రువాత ఇప్పుడు ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన రియాలిటీ షోల‌లో బిగ్‌బాస్ ఎంతో పేరుగాంచింది. తొలి రెండు సీజ‌న్లూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచాయి. అందులో భాగంగానే త్వ‌ర‌లో మూడో సీజ‌న్ కూడా ప్రారంభం కానుంది. తొలి సీజ‌న్‌కు ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, త‌రువాతి సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత అయ్యారు. ఆ త‌రువాత ఇప్పుడు ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈయ‌న ఈ షోకు హోస్ట్‌గా ఎంపికైన‌ప్ప‌టికీ స్టార్ మా ఆ విష‌యాన్ని గోప్యంగా ఉంచింది. ఈ క్ర‌మంలో ఇవాళ స్టార్ మా బిగ్‌బాస్ సీజ‌న్ 3 ప్రోమోను విడుద‌ల చేస్తూనే.. ఈ సారి షోకు హోస్ట్‌గా నాగార్జున ఉండ‌బోతున్నారంటూ.. ప్రోమోలో చెప్పించింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 3 లో 14 మంది పాల్గొంటున్నార‌ని చెప్పిన నాగార్జున టీజ‌ర్‌లో బిగ్‌బాస్ హౌస్‌మేట్ల‌కు 100 రోజుల‌కు కావ‌ల్సిన  ప‌చారీ స‌రుకుల‌ను కొంటుంటారు. ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నాన‌ని నాగార్జున చెబుతుండ‌గా.. ప్రోమో ముగుస్తుంది. అయితే తొలి సీజ‌న్‌లో ఎన్టీఆర్ బాగానే ఆక‌ట్టుకున్నాడు కానీ.. రెండో సీజ‌న్‌లో నాని హోస్ట్‌గా అంత బాగా చేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనికి తోడు కౌశ‌ల్ ఆర్మీ వ‌ల్ల షోకు ఆద‌ర‌ణ త‌గ్గిపోయింది. అయితే ఈ సారి అలాంటి త‌ప్పులు రిపీట్ కాకుండా స్టార్ మా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది.

అయితే ప్రోమోలో నాగార్జున న‌టించిన తీరును బ‌ట్టి ఈసారి బిగ్‌బాస్ సీజ‌న్ హిట్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. గ‌తంలో స్టార్ మాలో వ‌చ్చిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడుకు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి చ‌క్క‌ని పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడాయ‌న బిగ్‌బాస్ సీజ‌న్ 3 లో చేస్తున్నారు. ప్రోమోలో ఆయ‌న న‌టించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అందుక‌నే ఈ సారి షో క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ మాత్రం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news