బిగ్‌బాస్ పున‌ర్న‌వి పండ‌గ చేసుకుంటోందిగా…

-

పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా ఆమె చేసిన యాక్టింగ్ తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కి మ‌ర్చిపోలేరు. ఆ సినిమాలో రాజ్‌త‌రుణ్‌, అవికాగోర్ హీరో, హీరోయిన్లుగా న‌టించారు. ఆ త‌ర్వాత పున‌ర్న‌వి శర్వానంద్ హీరోగా వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఇక కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన పిట్ట‌గోడ సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టించింది. ఆమె ఎన్ని సినిమాలు చేసినా ఉయ్యాల జంపాలా సినిమాలో ఆమె క్యారెక్ట‌ర్‌కే మంచి మార్కులు ప‌డ్డాయి.

ఇక ఆమెకు సినిమాల్లో న‌టించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా వ‌చ్చేసింది. హౌస్‌లో పున‌ర్న‌వికి లేడీ మోనార్క్ అన్న బ్రాండ్ ప‌డిపోయింది. ఇక మ‌రో ఇంటి స‌భ్యుడు, సింగ‌ర్ అయిన రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె చాలా క్లోజ్‌గా మూవ్ అవ్వ‌డంతో ఈ జంట ప్రేమాయ‌ణం అంటూ బ‌య‌ట అంద‌రూ కోడై కూసేశారు. రాహుల్ ఫేక్ ఎలిమినేష‌న్ అయిన‌ప్పుడు కూడా ఆమె తెగ బాధ‌ప‌డిపోవ‌డం మ‌నం చూశాం.

ఇక పున‌ర్న‌వి హౌస్ నుంచి ఇప్ప‌టికే ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయిన‌ప్పుడు హిమ‌జ టీవీ ముందు చేసిన డ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన పున‌ర్న‌వి బిగ్‌బాస్ హౌస్‌లో త‌న స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. హౌస్‌లో ఆమె ఏకంగా రెండు నెల‌ల పాటు ఉన్నారు. మ‌ధ్య‌లో గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నా ఆమె రాహుల్‌తో క్లోజ్‌గా ఉండ‌డం.. వీరిద్ద‌రు జంట‌గా ఉండ‌డం… అటు వ‌రుణ్‌, విత‌క జంట ఫ్యాన్స్ కూడా ఆమెకు ఓటింగ్ వేయ‌డంతో గ‌ట్టెక్కింది.

ఇక తాజాగా పున్ను త‌న సోద‌రుడితో పాటు త‌న ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం ‘సైకిల్’, ‘చిన్న విరామం’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news