మళ్లీ బిగ్ బాస్ 3 మీ కోసం…!

-

బిగ్ బాస్… తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో ఇది. ఈ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ప్రేక్షకులు కూడా ఉన్నారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ విన్నర్ గా శివ బాలాజీ గెలవగా రెండో విన్నర్ గా… కౌశల్ గెలిచాడు. మూడో విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించాడు. ఇప్పుడు కరోనా కారణంగా దీన్ని మళ్ళీ పునః ప్రసారం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సీరియల్స్ అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ని ప్రసారం చెయ్యాలని భావిస్తున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ జరిగిన వాటిని ప్రసారం చేస్తారు. తర్వాత అన్నీ కూడా పాత షోస్ వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ 3 ని స్టార్ మా లో ప్రసారం చేయనున్నారు.

ఇతర టీవీ చానల్స్ కూడా ఇప్పుడు తమ సీరియల్స్ ని నిలిపివేస్తున్నాయి. ఈటీవీ పాత టీవీ షోస్ ని ప్రసారం చెయ్యాలని భావిస్తుంది. పాడుతా తీయగా సహా కొన్ని కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. జెమిని అయితే చక్రవారం, మొగలి రేకులు వంటి పాత సీరియల్స్ ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news