బిగ్‌బాస్ 4: సుమ స‌డ‌న్ ఎంట్రీ.. అవినాష్ ఎందుకేడ్చాడు?

బిగ్‌బాస్ ఈ వారం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ ఆదివారం యాంక‌ర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ స‌డ‌న్ షాకిచ్చింది. దీపావ‌ళికి ఇంటి స‌భ్యుల‌కు గిఫ్ట్‌లు తెచ్చానంటూ కొంత సేపు హ‌డావిడి చేసిన సుమ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నానంటూ ఇంటి స‌భ్యుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. ఈ విప‌త్తు ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటూ పంచ్‌లేసి కాసేసు ఆట‌ప‌ట్టించింది. ఇక హౌస్‌లోకి వెళ్ల‌బోతూ త‌రిగి మ‌ళ్లీ స్టేజ్ మీదికే వ‌చ్చేసింది. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్‌లు, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని, తాను హౌస్‌లోకి రాన‌ని తిరిగి బ‌య‌టికి వెళ్లిపోయింది.

అంత‌కు ముందు నాగార్జున ఇంటి స‌భ్యుల‌కు గిఫ్ట్‌లు పంపించారు. అయితే వీటిని పొందాలంటే మాత్రం త‌ను చెప్పిన టాస్క్‌లు ఆడాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అభికి డ్యాన్స్ చేయాల‌ని టాస్క్ ఇచ్చారు. దాన్ని ప‌నిష్మెంట్‌గా భావించిన అభిజిత్ దీని త‌రువాత త‌న‌కు కెరీర్ వుండ‌దు సార్ అని వాపోయాడు. ఇక ఈ టాస్క్‌లో సోహైల్‌కి గిఫ్ట్ అందాలంటే మోహ‌బూబ్ ఫేస్ తో చేతులు ప‌ట్టుకోకుండా బిస్కెట్లు తినాల‌న్నాడు. అలాగే మెహ‌బూబ్ తినేశాడు. అభి కోసం అఖిల్ టాస్క్ ఆడితే అఖిల్ కోసం అభి టాస్క్ ఆడి గెలిపించ‌డం ఈ ఎపిసోడ్ ప్ర‌త్యేక‌త‌గా నిలిచింది. ఈ టాస్క్‌లో లాస్య‌, మెహ‌బూబ్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక గిఫ్ట్‌లు అందుకోగా అభిజిత్‌, మోనాల్‌, అమ్మ‌రాజ‌శేఖ‌ర్, లాస్య, అరియానా, అవినాష్ ఎలాంటి గిఫ్ట్‌ల‌ని ద‌క్కించుకోలేక‌పోయారు.

ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేష‌న్‌లో వున్న అమ్మారాజ‌శేఖ‌ర్‌, అభిజిత్‌, మోనాల్‌, అవినాష్‌ల‌లో అభి ముందుగా సేఫ్ అయ్యాడు. ఆ త‌రువాత సేమ్ ఫ్రూట్ టాస్క్‌లో వ‌రుస‌గా యాపిల్ పిక్చ‌ర్స్ రావ‌డంతో మోనాల్ సేఫ్ కాగా చివ‌రికి అమ్మారాజ‌శేఖ‌ర్‌, అవినాష్ మిగిలారు. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ఈ ఇద్ద‌రిలో ఒక్క‌రే సేఫ్ అవుతార‌ని, మిగ‌తా వారు ఇంటికి వెళ్లిపోతార‌ని నాగ్ చెప్పి ఇద్ద‌రిని గేట్ వ‌ద్ద వున్న టు రూమ్స్‌లోకి వెళ్ల మ‌న‌డం.. గ్రిన్ లైట్ వెలిగిన త‌రువాత ఇంటి స‌భ్యుల్ని వెళ్లి చెక్ చేయ‌మ‌ని చెప్పారు. గ్రీన్ లైట్ వెలిగిన త‌రువాత టు రూమ్స్‌లో ఇద్ద‌రు వుండ‌క‌పోవ‌డంతో ఈ రోజు డ‌బుల్ ఎలిమినేష‌న్ అయి వుండొచ్చు అని నాగ్ చెప్ప‌డంతో ఇంటి స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు.

అంద‌రికి మించి అరియానా ఏడ్చేసింది. క‌ట్ చేస్తే అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యాడ‌ని.. అవినాష్ సేఫ్ అయ్యాడ‌ని చెప్ప‌డంతో స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఇంటి స‌భ్యులు చూస్తే కుప్ప‌కూలిపోయి అవినాష్ బోరున ఏడుస్తూ క‌నిపించాడు. ఒక్క‌సారిగా గుండె ఆగినంత ప‌ని అయింది అంటూ నాగ్ వారిస్తున్న అవినాష్ కంట‌త‌డి పెట్ట‌డంతో అరియానా కూడా ఏడ్చేసింది. బ‌య‌టికి వెళుతున్న అమ్మ‌రాజ‌శేఖ‌ర్ త‌ను వెళ్లిపోవాల‌నుకున్నాన‌ని చెప్పి వెళ్లిపోయాడు. సోమ‌వారం నుంచి మ‌ళ్లీ నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాబోతోంది. ఈ ద‌ఫా హౌస్ మ‌రింత హీటెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.